అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రముఖ నిర్మాత కుమారుడు !

అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రముఖ నిర్మాత కుమారుడు !

Published on May 8, 2018 4:26 PM IST

ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ ఈరోజు ఉదయం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతదేహాన్ని నెల్లూరు సమీపంలోని వాకాడు వద్ద సముద్ర తీరంలో కనుగొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని భార్గవ్ మరణం ప్రమాదవశాత్తు సంభవించిందా లేకపోతే దీనికి వెనుక వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్.గోపాల్ రెడ్డి బాలక్రిష్ణతో పలు సూపర్ హిట్ సినిమాల్ని రూపొందించారు. 2008లో ఆయన మరణం తర్వాత ఆయన కుటుంబం నుండి ఎవరూ పరిశ్రమలో పెద్దగా కొనసాగలేదు. భార్గవ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా భార్గవ్ కు అత్యంత సన్నిహితుడైన హీరో విశాల్ ట్విట్టర్ ద్వారా తన బాధను పంచుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు