హిందీలో రీమేక్ కానున్న ‘ప్రస్థానం’ !

హిందీలో రీమేక్ కానున్న ‘ప్రస్థానం’ !

Published on May 14, 2018 8:28 AM IST

శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు దేవ కట్ట రూపొందించిన చిత్రం ‘ప్రస్థానం’. 2010లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని దేవ కట్ట కెరీర్లోనే ఉత్తమమైన సినిమాగా నిలిచింది. ఈ చిత్రం జాతీ అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డుని సైతం కైవసం చేసుకుంది.

ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్, యువ హీరో అలీ ఫజల్ ఈ రీమేక్లో కీలక పాత్రలు చేయనుండగా అమైరా దస్తూర్ కూడ ఇందులో నటించనుంది. తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ చేసిన దేవ కట్ట ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయనుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు