టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “పోర్ తొళిల్”

టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “పోర్ తొళిల్”

Published on May 29, 2024 5:37 PM IST

ఆర్ ఆర్ శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో, విఘ్నేష్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పోర్ తొళిల్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం యొక్క తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా సొంతం చేసుకుంది.

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. శరత్ బాబు, నీళగల్ రవి, సునీల్ సుఖడ, సంతోష్ కీళాత్తూర్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేక్స్ బెజాయ్ సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు