సరికొత్త కథలతో, విభిన్న గెటప్‌లతో మనల్ని మెప్పిస్తూ ఉండే తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో మరో సరికొత్త కథతో మనముందుకు రానున్న విషయం తెలిసిందే! ఈ సినిమా తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ క్రేజ్ ఉంది. సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మించారు.
ఫస్ట్‌లుక్‌తోనే విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్ రిలీజ్‌తో సెన్సేషన్ సృష్టించింది. యూట్యూబ్‌లో ఈ టీజర్ లక్షల కొద్ది వ్యూస్‌తో దూసుకుపోతూ సినిమాకున్న క్రేజ్‌ను బయటపెట్టింది. ఇక ఈ సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ ప్రమోషన్‌ను కల్పించనున్నారు. తమిళ నాట ఈ సినిమాకు ఇప్పట్నుంచే అభిమానులు సిద్ధమైపోయారు. ప్రీ రిలీజ్ టాక్ చాలా పాజిటివ్‌గా ఉండడంతో మే 29న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయనున్నారు.