జేమ్స్ బాండ్ కి పాజిటీవ్ టాక్

జేమ్స్ బాండ్ కి పాజిటీవ్ టాక్

Published on Jul 23, 2015 10:55 PM IST

james-bond
అల్లరి నరేష్ నటించిన బాండ్ చిత్రం రేపు విడుదలకానుంది. సాయి కిషోర్ మచ్చా ఈ సినిమాకు దర్శకుడు. ఈయన శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసారు. సాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనుంది.

ఈ సినిమాలో చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు అత్యద్భుతంగా తెరకెక్కాయని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చెయ్యడమేకాక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తుంది. అల్లరి నరేష్ ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఈ సినిమాను ఏ.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మించారు.

తాజా వార్తలు