జ్యోతిక రీ ఎంట్రీ సినిమాకు పాజిటివ్ టాక్!

Jyothika
తమిళంలో అద్భుతమైన నటనతో స్టార్‌గా వెలుగొందిన తారల్లో ఒకరు జ్యోతిక. తమిళంలోనే కాక, ఇటు తెలుగులోనూ ‘చంద్రముఖి’తో పాటు ‘ఠాగూర్’, ‘మాస్’, ‘షాక్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారామె. ఆ తర్వాత తమిళ స్టార్ సూర్యను వివాహం చేసుకున్నాక కొన్నాళ్ళ పాటు నటనకు దూరమయ్యారు జ్యోతిక. ఏడేళ్ల విరామం తర్వాత ’36 వయధినిలె’ అనే సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు.

మళయాళంలో హిట్టయిన ‘హౌ ఓల్డ్‌ ఆర్‌ యూ’ అనే సినిమాకు తమిళ రీమేకే ఈ ’36 వయధినిలె’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళనాడుతో పాటు, తమిళ సినిమాకు మార్కెట్ ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ విడుదలకు సిద్ధమైంది. కాగా నిన్నే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోను చెన్నైలో ఏర్పాటు చేశారు. ఈ షో చూసినవారంతా ’36 వయధినిలె’ ఒక మంచి సినిమాగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. జ్యోతిక నటన ప్రతీ ఒక్కరిని కట్టిపడేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

రిలీజ్‌కు ముందే సినిమాకు ఈ రకమైన ఫీడ్‌బ్యాక్ రావడం పట్ల సూర్య చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాలో ఓ మధ్య వయస్కురాలైన మహిళగా జ్యోతిక నటించింది. ట్రైలర్ చూసినవారంతా జ్యోతిక కమ్‌బ్యాక్ సినిమాకు సరిగ్గా సరిపోయే సినిమా అని భావించారు. మరి ట్రైలర్, ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన స్పందన రేపు సినిమాకు సాధారణ ప్రేక్షకుడి నుంచి కూడా వస్తుందా అనేది తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే!

Exit mobile version