ఈ వారం విడుదల తెలుగు బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. కానీ అందులో కొన్ని మాత్రమే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా రవితేజ, కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ ప్రధాన తారాగణంగా వస్తున్న ‘సారొచ్చారు’ డిసెంబర్ 21న విడుదల కాబోతుంది. తమిళ్లో ‘కుమ్కి’ పేరుతో వచ్చిన చిత్రాన్ని తెలుగులో ‘గజరాజు’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ సినిమా కూడా డిసెంబర్ 21 విడుదల కానుంది. ఈ రెండు చిత్రాల విడుదలలో ఎలాంటి మార్పు లేదు. టీవీ యాంకర్ నుండి దర్శకుడిగా మారిన ఓంకార్ మొదటి సినిమా జీనియస్ కూడా ఈ వారమే విడుదల కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. విశాల్, త్రిషా జంటగా వస్తున్న ‘వేటాడు వెంటాడు’, అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ చిత్రాలు కూడా ఈ వారమే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలు వాయిదా పడటం వల్ల సారొచ్చారు సినిమాకి బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఈ వారం విడుదలయ్యే సినిమాలు వాయిదా పడబోతున్నాయా?
ఈ వారం విడుదలయ్యే సినిమాలు వాయిదా పడబోతున్నాయా?
Published on Dec 18, 2012 12:25 PM IST
సంబంధిత సమాచారం
- ప్యారడైజ్ కూడా పట్టాలు తప్పుతుందా.. నాని లెక్కల్లో తేడా వస్తుందా..?
- ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ కసర్తతులు.. అందులో ట్రైనింగ్..?
- విశ్వంభర : ఈ సైలెన్స్ కి కారణం ఏమిటో..?
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- ‘ధురంధర్ 2’ వెయ్యి కోట్లతో సాలిడ్ రికార్డు..!
- ‘డ్రాగన్’లో గోవిందా.. నిజమేనా ?
- బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్.. నాగ శౌర్య మాస్ చూపిస్తున్నాడుగా..!
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- ప్రదీప్ రంగనాథన్ తెలుగు మార్కెట్.. దిల్ రాజుకు క్రెడిట్
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- “విశ్వంభర” మరింత ఆలస్యం!?
- ‘రామాయణ’ కోసం రెహమాన్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- ఫోటో మూమెంట్: తన లవ్ లైఫ్ అండ్ ఫ్యామిలీతో బెల్లంకొండ శ్రీనివాస్


