నైజాంలో 5 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ‘పవర్’

నైజాంలో 5 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ‘పవర్’

Published on Sep 15, 2014 3:12 PM IST

power-latest
మాస్ మహారాజ రవితేజ హీరోనా నటంచిన మాస్ ఎంటర్టైనర్ ‘పవర్’ గత శుక్రవారం విడుదలై మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. అతే కాకుండా చాలా చోట్ల రవితేజ సినిమా ఓల్డ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టేలా కలెక్షన్స్ సృష్టిస్తోంది. ఈ రోజు ఉదయం మార్నింగ్ షో తో పవర్ సినిమా ఒక్క నిజాంలోనే 5 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఈ రోజు వీక్ డే అయినప్పటికీ బి,సి సెంటర్స్ లో కలెక్షన్స్ మాత్రం ఫుల్ గా ఉన్నాయి.

ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమా బడ్జెట్ ని ఒకటి లేదా రెండు వారాల్లో బ్రేక్ చెయ్యడమే కాకుండా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. కెఎస్ రవీంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హన్సిక, రెజీన హీరోయిన్స్ గా నటించారు. వచ్చే వారం రిలీజ్ కానున్న ‘ఆగడు’ సినిమా వల్ల కాస్త ఈ సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ఈ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు