మాస్ మహారాజ్ హీరోగా నటించిన పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘పవర్’. విడుదలైన ప్రతి చోట మాస్ ప్రేక్షకుల చేత సూపర్ హిట్ అనిపించుకుంటున్న ఈ సినిమా నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విడుదలైన నాలుగోరోజు మొదటి షో తోనే 5 కోట్ల షేర్ క్రాస్ చేసిన పవర్ మొదటి వీకెండ్ కల్లా 7.5 – 8 కోట్ల షేర్ సాధిస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొదటి 5 రోజుల వరకూ వచ్చిన రిపోర్ట్ ప్రకారం 6.5 కోట్ల షేర్ సాధించింది.
రవితేజ కెరీర్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి.. అలాగే 2014లో వచ్చిన సినిమాల్లో మొదటి వారం అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాల జాబితాలో పవర్ సినిమా కూడా చేరింది. కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాలో హన్సిక, రెజీన హీరోయిన్స్ గా నటించారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. రవితేజ రెండు గెటప్స్ లో చేసిన కామెడీ, పెర్ఫార్మన్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.


