నెంబర్ 1 ట్రెండింగ్ లోకి వచ్చేసిన పవర్ స్టార్.!

Published on Jan 15, 2021 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన సినిమా టీజర్ “వకీల్ సాబ్”. ఎట్టకేలకు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన ఈ సినిమా రీమేక్ అయ్యినప్పటికీ తన స్టార్డం తో ఓ రేంజ్ హైప్ తెచ్చి పెట్టారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్ నిన్న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలు నడుమ విడుదల కాబడింది. అయితే అక్కడ నుంచి ఈ టీజర్ సాలిడ్ రెస్పాన్స్ ను అందుకుంది.

రియల్ టైం వ్యూస్ లో భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానానికి వచ్చేసింది. ఆ మధ్య వచ్చిన మోషన్ పోస్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా మంచి రెస్పాన్సు వచ్చింది. ఇప్పటి వరకు 7 మిలియన్ కు పైగా వ్యూస్ మరియు 7 లక్షలకు పైగా లైక్స్ తో పవన్ కెరీర్ లో హైయెస్ట్ గా నిలిచింది. మరి ఇది ఫుల్ టైం లో ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు. అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :