కన్నడ పవర్ స్టార్ సరసన అదా శర్మ

కన్నడ పవర్ స్టార్ సరసన అదా శర్మ

Published on Jul 17, 2014 11:00 AM IST

adad-sharma-power-star
తెలుగు తెరకు పూరి జగన్నాధ్ పరిచయం చేసిన చెన్నై సుందరి ‘అదా శర్మ’. ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. అదా శర్మ అందం, అభినయం రెండిటి మంచి మార్కులే పడ్డాయి. అయినా ఎందుకో తెలుగులో మరిన్ని అవకశాలు పొందలేకపోయింది. తాజాగా కన్నడ చిత్రంలో నటించడానికి సంతకం చేసింది.

కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ సరసన ‘ధీర రణ విక్రమ’లో అదా శర్మ నటిస్తుంది. ఇది ఆమెకు కన్నడలో తొలి చిత్రం. కాలేజీ స్టూడెంట్ పాత్రలో అదా కనిపించనుంది. అంజలి మరొక హీరోయిన్. పవన్ వడయార్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగులో మంచు మనోజ్ ‘పోటుగాడు’ చిత్రానికి దర్శకత్వం వహించింది ఈయనే.

మాత్రు భాష తమిళంలో కూడా అదా శర్మను అవకాశం వరించిందట. ప్రస్తుతం తమిళ చిత్రానికి సంబంధించిన కాస్ట్యూమ్, మేకప్ టెస్ట్ జరుగుతోంది. త్వరలో సినిమా వివరాలు వెల్లడిస్తాను అని చెప్పింది. మాతృభాషలో అవకాశం రావడం చాలా ఆనందంగా, ఉద్వేగంగా ఉంది
adad-sharma

తాజా వార్తలు