దసరా నుండి పవన్ మరో సినిమాకి రెడీ ?

దసరా నుండి పవన్ మరో సినిమాకి రెడీ ?

Published on Apr 4, 2021 3:04 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాని దసరా నుండి మొదలుపెట్టాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడని.. పవన్ కూడా అక్టోబర్ నుండి నెలకు పది రోజులు చొప్పున డేట్స్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ ప్లాష్ బ్యాక్ లో ఐబీ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తాడట. కాగా తండ్రి పాత్రది ఐబీ ఆఫీసర్ పాత్ర అట. ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

ఆలాగే క్రిష్ సినిమా షూట్ లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. కాగా మొదటిసారి పవన్ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు