పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. పవన్ కి సినిమా షూటింగ్స్ లేని సమయం అంతా తన ప్రైవేట్ ఫాం హౌస్ లో తన పొలాల మధ్య గడుపుతూ ఉంటాడు. తన ఫార్మ్ లో తను పలు రకాల పండ్లు, కూరగాయలు పండిస్తుంటాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మామిడి పండ్లు..
ప్రతి సంవత్సరం టాలీవుడ్ లోని ప్రముఖులకు పవన్ కళ్యాణ్ బుట్టల్లో మామిడి పండ్లను పంపుతాడు. ఈ పండ్లకు తను ఎలాంటి ఫెస్టిసైడ్స్ వాడకపోవడం వల్ల అవి ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది సెలబ్రిటీస్ మామిడి పండ్లు రిసీవ్ చేసుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటారు. ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా పవన్ టాలీవుడ్ లోని ప్రముఖులకు మామిపండ్ల బాక్స్ ని పంపారు. కానీ ఈ సంవత్సరం లిస్టులో నితిన్ కూడా వచ్చి చేరారు. పవన్ కళ్యాణ్ పంచె ఈ మాంగో ట్రీట్ ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయ్యింది.
