లేటెస్ట్ : SK 21 కి పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్

లేటెస్ట్ : SK 21 కి పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్

Published on Feb 16, 2024 7:10 PM IST

తమిళ స్టార్ నటుడు శివకార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థల పై ప్రతిష్టాత్మకంగా ఒక మూవీ నిర్మితం అవుతోన్న విషయం తెలిసిందే. శివ కార్తికేయన్ కెరీర్ 21వ మూవీగా రూపొందుతోన్న దీనికి తాజాగా అమరన్ అనే పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.

కాగా ఈ పాన్ ఇండియన్ మూవీ యొక్క టైటిల్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ యక్ష హంగులతో రూపొందిన ఈ టీజర్ లో శివ కార్తికేయన్ పవర్ఫుల్ సోల్జర్ గా అదరగొట్టారు. గ్రాండియర్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన అమరన్ టీజర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో బాగా వ్యూస్ రాబడుతోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ గురించిన అప్ డేట్ ఒక్కొక్కటిగా త్వరలో రానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు