మరోసారి థియేటర్స్ లోకి పవర్ స్టార్ “వకీల్ సాబ్”

మరోసారి థియేటర్స్ లోకి పవర్ స్టార్ “వకీల్ సాబ్”

Published on Apr 27, 2024 7:04 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటికి చిన్న బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తను రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే సరైన అప్డేట్స్ లాంటివి లేక పవన్ ఫ్యాన్స్ సతమతమవుతున్న ఈ సమయంలో ఓ సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. పవన్ 2018 తర్వాత సినిమాలు వదిలేసిన చాలా కాలం తర్వాత చేసిన మాస్ కం బ్యాక్ హిట్ చిత్రం “వకీల్ సాబ్” ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం అలాంటి పీక్ కోవిడ్ సమయంలో కూడా భారీ వసూళ్లు అందుకుంది. దీనితో ఈ సినిమాకి ఆ సమయంలో కూడా మాస్ వేడుకలు జరిగాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఈ మే 1న సినిమా థియేటర్లు లోకి రానున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈసారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలీ, అనన్య నాగళ్ల, నివేత థామస్ లు ముఖ్యపాత్రలు పోషించారు. అలాగే థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు