జూలై చివరి నుంచి పవన్ కళ్యాణ్ యాక్షన్

pawan-kalyan

‘గోపాల గోపాల’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘గబ్బర్ సింగ్ 2’. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు లొకేషన్స్ వేట కూడా పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఒక చిన్న షెడ్యూల్ ని ఇటీవలే పూణేలో పూర్తి చేసారు. ఈ షెడ్యూల్ తర్వాత గబ్బర్ సింగ్ 2 టీం తదుపరి షెడ్యూల్ ని గుజరాత్ లో చెయ్యడానికి సిద్దమవుతోంది. కానీ ఎప్పుడు మొదలవుతుంది, పవన్ ఎప్పుడు సెట్స్ లో అడుగుపెడతాడు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

కానీ మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ జూలై చివరి వారం నుంచి పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టనున్నాడు. జూలై చివర్లో మొదలయ్యే ఈ షెడ్యూల్ 40 రోజుల పాటు కంటిన్యూగా జరగనుంది. ప్రస్తుతం బెంగుళూరు లో ఉన్న పవన్ కళ్యాణ్ డైలీ జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేస్తూ ఫుల్ గడ్డం లుక్ లో ఉన్నారు. ‘గబ్బర్ సింగ్ 2’లో పవన్ కొన్ని సీన్స్ లో ఫుల్ గడ్డం లుక్ లో కనిపిస్తారని సమాచారం.

2016 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనీష అంబ్రోసేని ఎంపిక చేసారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మించనున్నాడు.

Exit mobile version