నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్ రీమిక్స్ సాంగ్.!

నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్ రీమిక్స్ సాంగ్.!

Published on Mar 10, 2013 1:01 PM IST

Pawan-Nitin

‘ఇష్క్’ సినిమా హిట్ తో ఫుల్ జోరు మీదున్న నితిన్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ‘ఇష్క్’ సినిమా ఆడియో కూడా విడుదలైంది. అలాగే ‘గబ్బర్ సింగ్’ లో హిట్ అయిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ అనే పాటలోని లైన్ ని తీసుకొని తన రాబోయే సినిమాకి టైటిల్ గా పెట్టుకున్నాడు. ఈ సారి ఏకంగా మరో అడుగు ముందు కేసి పవన్ కళ్యాణ్ ఓ హిట్ సాంగ్ ని తన సినిమాలో రీమిక్స్ చేసి నితిన్ పవన్ మీద తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకోనున్నాడు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే ఎవర్గ్రీన్ హిట్ గా చెప్పుకునే సినిమా ‘తొలిప్రేమ’. ఈ సినిమాలోని ‘ఏమయ్యిందో ఏమో ఈ వేళ’ అనే సూపర్ హిట్ ఫాస్ట్ బీట్ సాంగ్ ని నితిన్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ తెలిపాడు అంతే కాకుండా ‘ ఈ సినిమాలో ఈ సాంగ్ హైలైట్ అవుతుంది. అలాగే ఈ సాంగ్ ని ఎంచుకోవడం ఒక చాలెంజ్ లాంటింది కానీ ఎవ్వరినీ నిరుత్సాహ పరచకుండా, అందరూ మెచ్చుకునేలా ఈ పాట ఉంటుందని’ నితిన్ ట్వీట్ చేసాడు

కె. విజయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి నిఖితా రెడ్డి నిర్మాత. అనూప్బ్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఐ. ఆండ్రూ సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు