సెన్సార్ పూర్తి చేసుకున్న పడి పడి లేచె మనసు !

Published on Dec 17, 2018 4:26 pm IST

యువ హీరో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పడి పడి లేచె మనసు’. ఇటీవల విడుదలైన ట్రైలర్ అలాగే ఆడియో ఈచిత్రం ఫై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ హైలైట్ కానుందని సమాచారం. ఇక ఈ చిత్రంసెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చింది. హను రాఘవ పూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శర్వా, ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుంది.

ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఈ రోజు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరుగనుంది. ఈ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. చెరుకూరిసుధాకర్,చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రండిసెంబర్ 21 న విడుదలకానుంది.

ఇక ఈచిత్రంతో పాటు సాయి పల్లవి నటించిన తమిళ చిత్రం ‘మారి 2’ కూడా అదే రోజు విడుదలకానుంది. మరి ఈ రెండు చిత్రాలతో సాయి పల్లవి ఒకే సారి రెండు విజయాలను ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :