ప్రభాస్ 20 ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే !

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో ‘చిత్రంలో నటిస్తున్నారని తెలిసిందే. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కు కొద్దీ రోజులు బ్రేక్ ఇవ్వనున్నాడు ప్రభాస్. ఎందుకంటె తన తదుపరి చిత్రం కోసం ఇటలీ వెళ్లనున్నాడు. ఇటీవల ప్రభాస్ 20వచిత్రం లాంచ్ అయినా విషయం తెలిసిందే.

‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించనున్న ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఈనెల 20నుండి ఇటలీ లో జరుగనుంది. మొదటగా హీరోయిన్ పూజాహెగ్డే తో పాటు ఇతర నటీనటులఫై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన తరువాత ప్రభాస్ ఈ షెడ్యూల్లో పాల్గొననున్నాడు. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రేమకథ నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈచిత్రం వచ్చే ఏడాదిలో విడుదలకానుంది.

Exit mobile version