రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ వారంలో హైదరాబాద్ నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ తో పాటే కీలక నటీనటులందరూ పాల్గొననున్నారు.
గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ మాత్రమే కాకుండా మంచి రొమాంటిక్ కంటెంట్ కూడా ఉండనుంది. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.


