అమితాబ్ అలా అన్నారు – ప్రభాస్

అమితాబ్ అలా అన్నారు – ప్రభాస్

Published on Jun 21, 2024 2:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ కల్కి జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

అయితే ప్రభాస్ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేను రోజూ అమితాబ్ బచ్చన్ సర్ పాదాలను తాకుతాను, అప్పుడు అమితాబ్ సార్ అలా చేయకండి, మీరు చేస్తే నేను మీకు చేస్తాను అని అన్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు