ప్రభాస్‌కు రెబల్ స్టార్ అనే బిరుదు రావడానికి, అయన స్టార్ హీరోగా ఎదగడానికి ప్రధాన కారణం స్క్రీన్ మీద ఆయన చేసే యాక్షన్ సన్నివేశాలే. ఫైట్స్ చేయడంలో అందరు హీరోలది ఒక స్టైల్ అయితే ప్రభాస్ ఒక్కరిదే మరొక స్టైల్. ఎంత పెద్ద యాక్షన్ సీన్ అయినా సరే ప్రభాస్‌కు సెట్టైపోతుంది.
ఒకరకంగా ‘బాహుబలి’ అంత విజయం సాధించడానికి, ‘సాహో’ బాలీవుడ్ ప్రేక్షకులకి అంతలా నచ్చడానికి ప్రధాన కారణం ప్రభాస్ విగ్రహం, ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలే అనడంలో సందేహమే లేదు. జాతీయ స్థాయిలో ఆయన ఒక పెద్ద యాక్షన్ హీరోలా అవతరించడానికి కూడా ఆయన యాక్షన్ సన్నివేశాల్లో పెర్ఫార్మ్ చేసే తీరే కారణం.
ప్రభాస్ సైతం తన ప్రధాన బలం యాక్షనే అంటున్నారు. తన మొదటి సినిమాలో రెండే ఫైట్స్ ఉంటాయని, వాటిలో తన యాక్షన్ అందరికీ నచ్చిందని, అప్పుడే యాక్షన్ సన్నివేశాల్లో తాను బాగుంటాననే విషయం తనకి అర్థమైందని, హైట్ తనకు మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్, యాక్షన్ ఎంటెర్టైనర్ చేస్తున్నారు.
