‘అది తెలియకే ఇంకా పెళ్లి చేసుకోలేదు’ – ప్రభాస్

Prabhas

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) తో ‘ది రాజాసాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తీసుకొస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పెళ్లిపై ప్రభాస్ సరదాగా మాట్లాడారు. ‘ది రాజాసాబ్’ ఈవెంట్ లో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రావడంతో.. ”ప్రభాస్ (Prabhas) ని పెళ్లి చేసుకోవాలంటే మాకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి ?” అని ఓ లేడీ ఫ్యాన్ ప్లకార్డు పట్టుకొని కనిపించింది.

ఆ లేడీ ఫ్యాన్ ప్లకార్డును చూసిన యాంకర్, ప్రభాస్ (Prabhas) ను ఇదే విషయం పై ప్రశ్నించింది. దానికి ప్రభాస్ స్పందిస్తూ.. ”అది తెలియకే ఇంకా పెళ్లి చేసుకోలేదు” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఇక మరో అభిమాని ”నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి ?, ఎంత ఆస్తి ఉండాలి ?, ఎలా ఉండాలి ?” అని ప్రశ్నించాడు. దానికి నిధి అగర్వాల్ స్పందిస్తూ.. ప్రేమించే వృత్తి ఉండాలని తెలివిగా సమాధానమిచ్చింది. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ నోటి నుంచి పెళ్లి మాట రావడంతో, ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Exit mobile version