ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైన రికార్డ్ ఇది

ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైన రికార్డ్ ఇది

Published on Oct 2, 2019 5:40 PM IST

prabha

ప్రభాస్ స్థాయి తెలుగు సినిమా స్థాయి నుండి జాతీయ స్థాయికి చేరింది. అందుకు నిదర్శనమే ‘సాహో’ వసూళ్లు. తెలుగులో టార్గెట్ రీచ్ కాలేకపోయినా హిందీలో మాత్రం ఊహించిన దానికంటే అధికంగానే వసూళ్లను రాబట్టింది. దీంతో ప్రభాస్ నేషనల్ లెవల్ హీరోగా అవతరించాడు. అంతేకాదు ఆయన పేరిట పలు కొత్త రికార్డులు కూడా ఏర్పడ్డాయి.

దక్షిణాది నుండి అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 చిత్రాల జాబితాలో మూడు ప్రభాస్ చేసిన సినిమాలే ఉండటం విశేషం. రూ.1500 కోట్ల వసూళ్లతో ‘బాహుబలి 2’ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో రజనీ ‘ 2 పాయింట్ 0’, మూడవ స్థానంలో ‘బాహుబలి’, నాల్గవ స్థానంలో ‘సాహో’, ఐదవ స్థానంలో ‘రోబో’ ఉన్నాయి.

ఇక తెలుగు నుండైతే ప్రభాస్ మూడు సినిమాలే టాప్ 10 జాబితాలో ఉన్నాయి. ఇలా మూడు సినిమాలతో టాప్ స్థానంలో ఉండటం ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైన ఫీట్ అనాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు