ఇస్మార్ట్ బ్యూటీతో ప్రభాస్ ఆటా పాట.!

ఇస్మార్ట్ బ్యూటీతో ప్రభాస్ ఆటా పాట.!

Published on Apr 17, 2024 1:59 PM IST


ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు మారుతితో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం “ది రాజా సాబ్” (The Raja Saab) కూడా ఒకటి. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా లేటెస్ట్ గానే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ కి ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ జాయిన్ అయినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో అదిరే సాంగ్ ని మారుతీ తెరకెక్కిస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

షూటింగ్ స్పాట్ నుంచి ఓ పిక్ బయటకొచ్చి వైరల్ గా మారుతుండగా ఈ సాంగ్ లో అయితే ప్రభాస్ అదరగొట్టేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే మారుతీ వింటేజ్ ప్రభాస్ ని రాజా సాబ్ లో విట్నెస్ చేస్తారని ప్రామిస్ చేసాడు. మరి ఈ సినిమాలో వీరిద్దరి ఆటా పాట ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు