మహేష్ థియేటర్ లో ప్రభాస్ !

Published on Sep 9, 2019 3:35 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన ‘సాహో’. ఈ చిత్రం ఇప్పటికే యూఎస్ లో 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 80 కోట్ల షేర్ ను సాధించింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకు హైదరాబాద్‌లో ఏఎంబీ మాల్ పేరుతో థియేటర్ ఉంది.

ప్రస్తుతం ప్రముఖులు సినిమాలు చూసేందుకు ఎక్కువుగా ఏఎంబీ మాల్కే వస్తుంటారు. కాగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తానూ నటించిన సాహో సినిమాను చూసేందుకు ఈ రోజు ఏఎంబీ మాల్‌ కు విచ్చేశాడు. దాంతో అభిమానులు ప్రభాస్‌ తో ఫోటో దిగేందుకు .. ప్రభాస్ ను చూసేందుకు పోటీ పడ్డారు.

సంబంధిత సమాచారం :

X
More