నిశ్చితార్థ వేడుకలో ప్రభాస్ !

నిశ్చితార్థ వేడుకలో ప్రభాస్ !

Published on Nov 18, 2019 10:32 PM IST

Prabhas2

ప్రముఖ నిర్మాత లక్ష‍్మణ్‌ కుమారుడు ఉజ్వల్‌ నిశ్చితార్థ వేడుక నిన్న ఘనంగా జరిగింది. కాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకల్లో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, మరియు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా వైట్‌ షర్ట్‌, కళ్లజోడుతో వచ్చిన ప్రభాస్‌ అందరిని నవ్వుతూ పలకరిస్తూ నిశ్చితార్థ వేడుకలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అలాగే విజయ్ దేవరకొండ కూడా ఎప్పటిలాగే డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో వచ్చాడు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సతీమణీ నమ్రత అలాగే సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు