ప్రభాస్ పెద్ద మనసు..తెలుగు దర్శకుల అసోసియేషన్ కి విరాళం

ప్రభాస్ పెద్ద మనసు..తెలుగు దర్శకుల అసోసియేషన్ కి విరాళం

Published on Apr 23, 2024 11:01 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల అప్డేట్స్ కోసం ఓ పక్క అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ హీరో గానే కాకుండా ఓ వ్యక్తిగా కూడా ఎందరో అభిమానాన్ని చూరగొన్నాడు. అలా ఇప్పుడు వరకు ప్రభాస్ ఎన్నో విరాళాలు కూడా అందించగా మరోసారి తన పెద్ద మనసు డార్లింగ్ చాటుకున్నాడు.

ఇటీవల మన తెలుగు సినిమా దర్శకుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గుడుంబా శంకర్ దర్శకుడు వీర శంకర్ ఎంపిక అయ్యిన సంగతి తెలిసిందే. మరి తాజాగా తాను సహా ప్రస్తుత స్టార్ దర్శకులు అంతా కలిసిన మీటప్ లో స్వయంగా వీర శంకర్ తెలిపారు. ప్రభాస్ 35 లక్షల విరాళాన్ని తమ అసోసియేషన్ కి అందించారు అని అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా తెలిపారు.

దీనితో మరోసారి ప్రభాస్ కి మన తెలుగు సినిమా పట్ల తెలుగు దర్శకుల పట్ల ఉన్న మక్కువ నిరూపితం అయ్యింది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన “కల్కి 2898ఎడి” రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు