ప్రభాస్ బ్రాండ్ ఎఫెక్ట్..”సలార్”పై నాన్ స్టాప్ గాసిప్స్!

Published on Mar 4, 2021 10:00 am IST

ఇప్పుడు మన ఇండియన్ సినిమాలోనే ప్రభాస్ పేరు ఒక బ్రాండ్. “సాహో” ప్లాప్ అయ్యినప్పటికీ దాని ఎఫెక్ట్ ను మించి మళ్ళీ క్రేజ్ ను ఇప్పుడు చేస్తున్న సినిమాలకు ప్రభాస్ తెచ్చుకోగలిగాడు అక్కడే అర్ధం అవుతుంది ప్రభాస్ మ్యానియా పాన్ ఇండియన్ లెవెల్లో ఎలా ఉంది అన్నది.

మరి అలా తాను చేస్తున్న మరో లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”పై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడం నుంచి మరింత పెరిగాయి. అయితే ఈ భారీ చిత్రానికి సంబంధించి గత రెండు రోజులుగా కొన్ని గాసిప్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం తాలూకా డిజిటల్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు భారీ ధరకు కొనుగోలు చేసారని విన్నాము. కానీ ఇప్పుడు మరో టాక్ ఏంటి అంటే ఈ చిత్రం తాలూకా హక్కులు ఇండియాలోనే ఏ ఇతర హీరో సినిమాకు కూడా ఇవ్వని ధరను ఈ సినిమాకు ఇచ్చారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ గట్టిగానే ఈ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :