తెలుగు సినిమా స్టార్ హీరోస్ సినిమా చేసామా హిట్ కొట్టామా అన్నట్టు ఉండరు. తమ అభిమానులకు ఎలాంటి సమస్య వచ్చినా మేమున్నాం అని ముందుంటారు, అలాగే ఇప్పటికే పలు సమస్యల్లో ఉన్న అభిమానులకు స్టార్ హీరోస్ తన సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అంతే కాకుండా స్టార్స్ సామాజిక కార్యక్రమాలలో పాల్గొని పలవు విషయాల్లో అవగాహన పెంచుతున్నారు. తాజాగా మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, మంచి విష్ణులతో పాటు పలువురు స్టార్స్ పలు గ్రామాలను దత్తత తీసుకొని వాటిని డెవలప్ చేయనున్నారు. ఇలా ఎవరికీ వీలైన సాయం వారు చేస్తూనే ఉన్నారు.
ఈ ఏడాది బాహుబలి సినిమాతో ఇండియా వైడ్ పేరు తెచ్చుకున్న స్టార్ హీరో ప్రభాస్ కూడా రీసెంట్ గా ఓల్డ్ పీపుల్ కి తన సాయం అందించాడు. ఇటీవలే వరంగల్ కి చెందిన జీసస్ ఒల్డేజ్ హోంకి చెందిన వారు వచ్చి సహాయం చేయమని అడిగితే ప్రభాస్ వెంటనే 5 లక్షల రూపాయలు వారికి సహాయం చేసాడు. అడగ్గానే ఓల్డ్ పీపుల్ కోసం ఇంతలా సాయం చేసినందుకు వారు ప్రభాస్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 కోసం మళ్ళీ కండలు పెంచే పనిలో ఉన్నాడు. డిసెంబర్ 14 నుంచి బాహుబలి 2 షూట్ మొదలు కానుంది. రాజమౌళి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు.
