‘సాహో’ సర్ప్రైజ్ ట్రీట్ కోసం ఆతృతగా డార్లింగ్ ఫ్యాన్స్

‘సాహో’ సర్ప్రైజ్ ట్రీట్ కోసం ఆతృతగా డార్లింగ్ ఫ్యాన్స్

Published on Jul 30, 2019 8:33 AM IST

నిన్న డార్లింగ్ ప్రభాస్ తన ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నేడు “సాహో” మూవీలోని “ఏచోట నువ్వున్నా” సాంగ్ టీజర్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్దా కపూర్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ డ్రెస్సెస్ లో ఓ రొమాంటిక్ పోజ్ లో ఉన్న పోస్టర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ చూస్తుంటే “సాహో” లో ఉత్కంఠరేపే పోరాట సన్నివేశాలతో పాటు, మైమరిపించే రొమాంటిక్ పార్ట్ కూడా ఉందనిపిస్తుంది.

“ఏచోట నువ్వున్నా” రొమాంటిక్ సాంగ్ ని ఆస్ట్రియా దేశంలోని ఆల్ప్స్ పర్వతాలలో తెరకెక్కించడం జరిగింది.అత్యంత ఎత్తైన ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల మధ్య గడ్డ కట్టే చలిలో వారానికి పైగా కష్టపడి ఈ సాంగ్ ని తెరకెక్కించారని సమాచారం. సినిమా గ్రాండ్ గా రావడానికి దర్శక నిర్మాతలు,నటులు చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే “సాహో” చిత్రంలోని “సైకో సైయ్యాన్ ” సాంగ్ ని విడుదల చేయడం జరిగింది. కొంచెం వెస్ట్రన్ బీట్ తో పబ్ నేపథ్యంలో సాగిన ఆ పాటలో శ్రద్దా హీటెక్కించే స్కట్ లో సెక్సీ స్టెప్స్ తో ఆకట్టుకుంది. మరి ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 30న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు