లేటెస్ట్ : “గామి” ట్రైలర్ పై ప్రభాస్ ఎగ్జైటింగ్ కామెంట్స్ తో సాలిడ్ బూస్టప్

లేటెస్ట్ : “గామి” ట్రైలర్ పై ప్రభాస్ ఎగ్జైటింగ్ కామెంట్స్ తో సాలిడ్ బూస్టప్

Published on Mar 1, 2024 10:10 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారుతున్నా సెన్సేషనల్ సినిమా “గామి”. యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నూతన దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన ఈ మైండ్ బ్లోయింగ్ విజువల్ ట్రీట్ ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా గేమ్ ఛేంజింగ్ టాక్ ని సంతరించుకుంది. అయితే ఈ సినిమాకి మరింత బూస్టప్ ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అందించాడు.

ఈ ట్రైలర్ చూసాక తానే స్వయంగా వీడియో బైట్ ఇచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలని అనుకున్నానని తెలిపాడు. అంతే కాకుండా విశ్వక్ సేన్ ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మొదటి సారి టీజర్ విక్కీ చూపించినపుడు చాలా బాగా అనిపించింది అలాగే ట్రైలర్ చూసాక మరింత ఎగ్జైటింగ్ గా అనిపించింది అని అలాగే మార్చ్ 8 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని తెలిపాడు.

అందరి హార్డ్ వర్క్ ట్రైలర్ లో కనిపిస్తుంది అని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను అని ప్రభాస్ తెలిపాడు. దీనితో ఈ క్లిప్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఫ్యాన్స్ లో వైరల్ గా మారగా గామి యూనిట్ కి మరింత పాజిటివ్ వైబ్స్ ని తీసుకొచ్చింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు