సుజీత్ ని పొగడలా,తిట్టాలా? కన్ఫ్యూషన్ లో ప్రభాస్ ఫ్యాన్

సుజీత్ ని పొగడలా,తిట్టాలా? కన్ఫ్యూషన్ లో ప్రభాస్ ఫ్యాన్

Published on Sep 6, 2019 11:08 AM IST

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ సాహో చిత్రం పట్ల ఒక ప్రక్క అసహనంగా, మరో ప్రక్క ఆనందంగా ఉన్నారు. సాహో మూవీ మిశ్రమ ఫలితాలు ఇవ్వడమే ఇందుకు కారణం. బాలీవుడ్ లో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి, సూపర్ హిట్ దిశగా సాహో వెళుతుంది. ఉత్తర భారత దేశంలో ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుంది. హిందీ హక్కులు కొన్న బయ్యర్లు హ్యాపీగా ఉన్నారు.

కానీ తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో సాహో వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. కొన్ని చోట్ల సాహో భారీ నష్టాలు మిగిల్చేలా ఉంది. సాహో ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా రాబట్టినప్పటికీ అత్యధిక ధరకు హక్కులు అమ్ముడైన కారణంగా సాహో రాబట్టాల్సిన లెక్క ఇంకా చాలా ఉంది. తెలుగులో సుజీత్ టేకింగ్ చాలా మందికి కనెక్ట్ కాలేదు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం సుజీత్ పట్ల ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ఆయన తీసిన సాహో జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించిందని పొగడాలో, మాతృ భాష తెలుగులో పరాజయం చెందిందని తిట్టాలో తెలియని పరిస్థితి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు