మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో అపరారమైన ప్రజాధారణ కలిగిన స్టార్ హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. బాహుబలి కి ముందు మన తెలుగు రాష్ట్రాల్లోనే భారీ క్రేజ్ ను తెచ్చుకున్న డార్లింగ్ ఇప్పుడు బాహుబలి తర్వాత జాతీయ స్థాయిలోనే బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా దక్కని ఫాలోయింగ్ ను సైతం ప్రభాస్ దక్కించుకున్నాడు. అది బాక్సాఫీస్ వరకు పరిమితం అయితే సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ కు వేరే లెవెల్ క్రేజ్ ఉందని మరోసారి ప్రూవ్ అయ్యింది.
ఆ మధ్య కేవలం రోజుల వ్యవధిలోనే మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ను ప్రభాస్ సాధించాడు. అయితే ప్రభాస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నదే తక్కువ పేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లలో మాత్రమే ఉన్న ప్రభాస్ ఇపుడు 25 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించి మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేసాడు. పైగా మన దక్షిణాదిలో ఈ మార్క్ ఉన్న టాప్ 3 సెలెబ్రెటీ ప్రభాస్ కావడం ఒకెత్తు అయితే కేవలం రెండు మాధ్యమాల్లో ఉండి కొట్టడం గమనార్హం. ప్రస్తుతం ప్రభాస్ “రాధే శ్యామ్”, “ఆదిపురుష్” అలాగే నాగశ్విన్ తో మూడు భారీ ప్రాజెక్టులను చేస్తున్న సంగతి తెలిసిందే.