అనుకోకుండా అధీరాను కలిసిన ప్రభాస్ హీరోయిన్.!

Published on Nov 27, 2020 2:00 pm IST

ఇప్పుడు దక్షిణాది నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇపుడు ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం మేకర్స్ నిన్ననే హైదరాబాద్ కు వచ్చేసారు. యష్ నిన్న హైదరాబాద్ లో షూట్ కు ల్యాండ్ అవ్వగా సంజయ్ దత్ కూడా హైదరాబాద్ హోటల్లో దిగారు. అయితే సంజయ్ ను అనుకోకుండా ప్రభాస్ తో మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇపుడు బాలీవుడ్ స్టార్ నటిగా మారిన కంగనా రనౌత్ కలిసిందట.

అదే విషయాన్ని తాను చెప్పింది. ఈరోజు హైదరాబాద్ హోటల్లో తనతో పాటు సంజయ్ కూడా ఉన్నారని తెలిసిందని దీనితో ఆయన్ను కలిసి ఆయన ఆరోగ్య సమాచారాన్ని కనుకున్నానని కంగనా తెలిపింది. అలాగే ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాని తెలిపింది.

సంబంధిత సమాచారం :

More