“సలార్” కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ప్రభాస్.?

“సలార్” కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ప్రభాస్.?

Published on Dec 7, 2023 7:04 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “సలార్” కోసం ఆడియెన్స్ ఎంత ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ దగ్గరకి వస్తుండగా మేకర్స్ అన్ని పనులు ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.

మరి వాటితో పాటుగా ప్రభాస్ కూడా తన ఫైనల్ వర్క్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనితో ప్రభాస్ ప్రస్తుతం తన డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడట. ప్రస్తుతం తన అన్ని వెర్షన్ ల డబ్బింగ్ లని హైదరాబాద్ లోనే కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ భారీ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఈ డిసెంబర్ 22న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు