ఇండియా మొత్తం ఇన్స్పైర్ అయ్యింది వీళ్లిద్దరిని చూసే – రెబల్ స్టార్ ప్రభాస్

ఇండియా మొత్తం ఇన్స్పైర్ అయ్యింది వీళ్లిద్దరిని చూసే – రెబల్ స్టార్ ప్రభాస్

Published on May 23, 2024 1:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏ.డి (Kalki 2898AD). దీపికా పదుకునే, దిశా పటానిలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కల్కి మూవీ టీమ్ బుజ్జి x భైరవ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించింది.

ఈ ఈవెంట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ లతో కలిసి వర్క్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇండియా మొత్తం ఇన్స్పైర్ అయ్యిందే వీళ్ళిదిరిని చూసే, అదృష్టం కొద్దీ వాళ్ళిద్దరితో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చింది అని అన్నారు. అమితాబ్ లాంటి నటుడు ఇండియా లో అన్నందుకు ఇండియా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి అని అన్నారు. సాగర సంగమం సినిమా చూసి అలాంటి బట్టలే కావాలి అని మా అమ్మని అడిగే వాడిని అని అన్నారు. కమల్ హాసన్, అమితాబ్ లతో పాటుగా, దీపికా పదుకునే, దిశా పటాని, చిత్ర యూనిట్ కి థాంక్స్ తెలిపారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు