కండలకు నిర్వచనం చెప్పే పనిలో ఉన్న ప్రభాస్

కండలకు నిర్వచనం చెప్పే పనిలో ఉన్న ప్రభాస్

Published on Mar 13, 2013 11:40 AM IST

Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో నటించడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలో మనకు ప్రభాస్ భారీ కండలతో కనిపించనున్నాడు. మనం ఆ కండలను చూస్తే పాత్ర కోసం ఎంత కష్టపడి బాడీని ఇలా పెంచడా అనిపిస్తుంది. ప్రభాస్ చేసే పాత్రకి కండలు తిరిగి ఉన్న బాడీ అవసరం కావున ప్రభాస్ ప్రస్తుతం కండలంటే ఈ రేంజ్ లో ఉండాలి అనేలా పెంచుతున్నాడు. లేమన్స్ లాగా అంటే కట్స్, కండలుపెంచడమే పనిగా ఉండే వారిలాగా పెంచుతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఈ వేసవిలో మొదలవుతుంది. రానా దగ్గుబాటి ఈ సినిమాలో ప్రభాస్ తమ్ముడిగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ప్రస్తుతం ప్రీ -ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు