ప్రభాస్ “కల్కి” కి కూడా హాలీవుడ్ సినిమాతో క్లాష్?

ప్రభాస్ “కల్కి” కి కూడా హాలీవుడ్ సినిమాతో క్లాష్?

Published on Jan 14, 2024 6:54 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి రీసెంట్ గానే సలార్ తో మంచి హిట్ అందుకొని ట్రాక్ లోకి వచ్చిన తాను ఈ ఏడాదిలో అయితే తన మొదటి సినిమా రిలీజ్ తో అయితే సిద్ధం కాబోతున్నాడు. మరి ఈ చిత్రమే “కల్కి 2898ఎడి” కాగా దీనిని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ప్రెజెంట్ చేసి హాలీవుడ్ లో కూడా గ్రాండ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సినిమాకి కూడా హాలీవుడ్ లెవెల్లో అయితే క్లాష్ తప్పేలా లేదని చెప్పాలి. లాస్ట్ టైం సలార్ కే హాలీవుడ్ చిత్రం “ఆక్వా మేన్ 2” తో పోటీ పడింది.

కానీ ఆ సినిమా ఐమాక్స్ రిలీజ్ ని సలార్ మేకర్స్ ఆపుకున్నారు. ఇప్పుడు కల్కి కి హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ తో క్లాష్ పడింది. దీనితో ఇది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అని చెప్పాలి. మరి దీనిపై మేకర్స్ ఎలాంటి ప్లానింగ్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు