ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసిన ప్రభాస్ లేటెస్ట్ ఇన్స్టా పోస్ట్

ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసిన ప్రభాస్ లేటెస్ట్ ఇన్స్టా పోస్ట్

Published on May 17, 2024 11:52 AM IST


ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరోగా చేస్తున్న భారీ చిత్రాల్లో “కల్కి 2898 ఎడి” (Kalki 2898 AD) అతి త్వరలో రిలీజ్ కానుండగా ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్ కూడా మొదలవులున్నాయి. అయితే ప్రభాస్ నుంచి ఒక బ్రేకింగ్ పోస్ట్ అందరిలో ఇప్పుడు షాకింగ్ గా మారింది. ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అందరికీ చెప్తున్నట్టుగా ఓ అనౌన్సమెంట్ ఇచ్చాడు.

“డార్లింగ్స్, మన లైఫ్ లోకి చాలా ప్రత్యేకమైన ఓ వ్యక్తి ఎంటర్ కాబోతున్నారు వెయిట్ చెయ్యండి” అంటూ సడెన్ పోస్ట్ తో షాకిచ్చాడు. ఈ ఒక్క పోస్ట్ తో అభిమానుల్లో మామూలు గందరగోళం నెలకొనలేదు.

ప్రభాస్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని కొందరు, కల్కి ప్రమోషన్స్ కోసమే ఇలా చేస్తున్నారని మరికొందరు, ఇంకా ప్రభాస్ పెళ్లి కోసం అయితే కాదు కదా అంటూ ఇలా అనేక రకాలుగా ఈ పోస్ట్ ఇప్పుడు కన్ఫ్యూజన్ గా మారిపోయి ఫ్యాన్స్ ని గందరగోళం లోకి నెట్టేసింది. దీనితో ఒక్కసారిగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి ప్రభాస్ పెట్టిన పోస్ట్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తానే రివీల్ చేసేవరకు ఆగక తప్పదు మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు