కల్కి ఈవెంట్ లో బుజ్జీతో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్!

కల్కి ఈవెంట్ లో బుజ్జీతో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్!

Published on May 22, 2024 10:00 PM IST

గత కొన్ని రోజులుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏ.డి ఈవెంట్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. మేకర్స్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ చేయబడిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రత్యేక వాహనం బుజ్జిని వెల్లడించారు. బుజ్జిని పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ కస్టమైజ్డ్ వెహికిల్ రైడింగ్ తో ప్రభాస్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసి నాగ్ అశ్విన్ అండ్ టీమ్ మంచి మార్కులే కొట్టేశారు.

ఈ బుజ్జి – భైరవ ఈవెంట్ ప్రత్యేక వాహనం యొక్క స్నీక్ పీక్ ఇవ్వడానికి ప్రత్యేకంగా నిర్వహించబడింది. పాన్ ఇండియా స్టార్ ఎంట్రీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మెగా ఈవెంట్‌కు ప్రభాస్, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్ హాజరయ్యారు. ఈ చిత్రం అనేక భాషల్లో జూన్ 27, 2024న గ్రాండ్ రిలీజ్‌కి షెడ్యూల్ చేయబడింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే మరియు దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు