జూలై నుండి మొదలుకానున్న ప్రభాస్ కొత్త సినిమా !
Published on Mar 13, 2018 12:05 pm IST

‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ సుజీత్ డైరెక్షన్లో ‘సాహో’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. అక్కడే హెవీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తరవాత ప్రభాస్ కృష్ణం రాజు యొక్క గోపికృష్ణ బ్యానర్లో ఒక సినిమాని చేయనున్నాడు.

ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేయనున్నారు. ఇక గత రెండు రోజులుగా ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తుందని వార్తలు వస్తుండగా తాజాగా పూజా హెగ్డే కూడ ఆ విషయాన్ని అంగీకరించారని, అంతేగాక జూలై నెల నుండి షూటింగ్ ఉంటుందని చెప్పారట. సో.. ప్రబాస్ ఇంకొద్ది రోజుల్లో యాక్షన్ సినిమాని ముగించి రొమాంటిక్ ఎంటర్టైనర్ ని మొదలుపెట్టనున్నాడన్నమాట.

 
Like us on Facebook