ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆ విషయం బాగా హర్ట్ చేసిందట

Published on Oct 24, 2019 9:16 am IST

నిన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తాయి. టాలీవుడ్ ప్రముఖులు, నటులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఐతే ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తుంది.దానికి కారణం తాజాగా ప్రభాస్ నటిస్తున్న జాన్ మూవీ నుండి ఏదోఒక అప్డేట్ ఇస్తారని అందరూ ఆశించారు. కనీసం టైటిల్ అనౌన్స్మెంట్ లేదా ప్రభాస్ లుక్ కి సంబందించిన పోస్టర్ విడుదల చేస్తారని భావించారు. ఐతే అలాంటిదేమి లేకుండా ప్రభాస్ పింక్ కలర్ షర్ట్ లో ఉన్న రెగ్యులర్ లుక్ ఒకటి విడుదల చేశారు నిర్మాతలు.

ఈ విషయం ఒకింత అభిమానుల ఆగ్రహానికి కారణమైనదని తెలుస్తుంది. అసలు ఎటువంటి లుక్ విడుదల చేయకపోయినా పర్వాలేదు కానీ…,ఎటువంటి ఆసక్తి కలిగించని ఇలాంటి ఫోటో విడుదల చేయాల్సిన అవసరం ఏముంది అని వారు అంటున్నారు. ప్రభాస్ పుట్టిన రోజుకు మంచి అప్డేట్ ఇవ్వాలనే సరైన ప్రణాళిక లేని యూవీ క్రియేషన్స్ పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇక దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న జాన్ చిత్రంలో పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More