సాహో ఫలితం పై ప్రభాస్ రియాక్షన్

సాహో ఫలితం పై ప్రభాస్ రియాక్షన్

Published on Sep 5, 2019 10:05 PM IST

ప్రభాస్ సాహో విడుదల తరువాత మొదటిసారి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన సాహో ఫలితంపై తన ఫీలింగ్ తెలియజేశారు. వివరాలలోకి వెళితే నేడు ప్రభాస్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో సాహో కలెక్షన్స్ పోస్టర్ పెట్టి ధన్యవాదాలు తెలిపారు. సాహో చిత్రం పై మీరు చూపించిన ప్రేమానురాగాలు, అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.

సాహో విడుదల అనంతరం వెకేషన్ కొరకు విదేశాలకు వెళ్లిన ప్రభాస్ తిరిగి ఇండియా వచ్చినట్లు తెలుస్తుంది. ప్రభాస్ సాహో విడుదలకు ముందు దాదాపు నెలరోజులు నిరవధికంగా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. కాగా బాలీవుడ్ లో రికార్డు వసూళ్లు సాధిస్తున్న సాహో తెలుగులో మాత్రం గడ్డుపరిస్థితులు ఎదుర్కోవడం గమనార్హం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు