‘బాహుబలి 2’కి రెడీ అంటున్న ప్రభాస్

Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు రెండేళ్ళు కష్టపడి చేసిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా ఈ ఏడాది జూలై 10న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలుపుకొని 600కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ బాహుబలి మరియు శివుడు పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఆ రెండు పాత్రల కోసమూ డిఫరెంట్ ఫిజిక్స్ ని కూడా మైంటైన్ చేసాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ షూటింగ్ అయిపోగానే డైటింగ్ మరియు జిమ్ ని పక్కన పెట్టి హ్యాపీ గా ఇష్టపడిన ఫుడ్ ని లాగించేసాడు.

రాజమౌళి బాహుబలి 2 కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ కూడా చివరి దశకు తీసుకు వచ్చేసాడు. డిసెంబర్ 14 నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. దాంతో హాలిడేస్ ని ఫినిష్ చేసుకున్న ప్రభాస్ గత నెల రోజులుగా మళ్ళీ జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేయడం మొదలు పెట్టాడు. ప్రభాస్ సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం మళ్ళీ ప్రభాస్ బాహుబలి సినిమా కోసం కండలు పెంచేసి భారీ శరీరాకృతితో తయారయ్యాడని, షూట్ కి సిద్దం అయిపోయాడని చెబుతున్నారు. బాహుబలి 1 కి మించి బాహుబలి 2 ఉండేలా రాజమౌళి కథని, అందులోని సన్నివేశాలను సిద్దం చేసేసారు. ముఖ్యంగా బాహుబలి 2 చివర్లో వచ్చే 30 నిమిషాల వార్ ఎపిసోడ్ ని తెలుగు ప్రేక్షకులు మహా అద్భుతం అని ఫీలయ్యేలా డిజైన్ చేసారని సమాచారం.

Exit mobile version