బజ్: ‘బుజ్జి’ హిందీ వెర్షన్ కోసం “సాహో” బ్యూటీ?

బజ్: ‘బుజ్జి’ హిందీ వెర్షన్ కోసం “సాహో” బ్యూటీ?

Published on May 24, 2024 9:00 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటానిలు ఫీమేల్ లీడ్స్ లో ఇంకా లోకనాయకుడు కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ ల కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” (Kalki 2898 AD). మరి ఈ అందరు సూపర్ స్టార్స్ తో సహా మరో ప్రాణం లేని సూపర్ స్టార్ గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాని టేకోవర్ చేసింది. అదే ‘బుజ్జి’.

ఒక ఫ్యూచరిస్టిక్ రోబోట్ మరియు కార్ లా రివీల్ చేసిన మేకర్స్ సాలిడ్ హైప్ దీనితో అందుకున్నారు. అయితే ఈ ఈ బుజ్జి కోసం టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అయితే కేజ్రీగా క్లిక్ అయ్యింది. మరి ఈమె తెలుగు తమిళ్ వెర్షన్ లకి చెప్పనుండగా హిందీ వెర్షన్ కి ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

దీని ప్రకారం హిందీ వెర్షన్ కి బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అలాగే ప్రభాస్ తో భారీ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రద్దా కపూర్ చెప్తుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ అవైటెడ్ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా ఈ జూన్ 27న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు