10 సినిమాలు వరకు ప్రభాస్ సెన్సేషనల్ లైనప్?

10 సినిమాలు వరకు ప్రభాస్ సెన్సేషనల్ లైనప్?

Published on Feb 21, 2024 5:27 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న హిట్ అయితే తన లాస్ట్ చిత్రం “సలార్” తో అందుకున్నాడు. దీనితో ఇక నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. అలాగే మన ఇండియన్ సినిమా లోనే మోస్ట్ అవైటెడ్ లైనప్ కూడా ప్రభాస్ నుంచే ఉందని చెప్పాలి. ఒకదాన్ని మించి మరో సినిమాతో ప్రభాస్ సినిమాలు సెట్ చేసుకోగా తన లైనప్ కి సంబంధించి మొత్తం 10 సినిమాల వరకు కూడా మాసివ్ లైనప్ ని సెట్ చేసుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఈ లైనప్ లో ప్రస్తుతానికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యి ఉన్న చిత్రాలు కల్కి 2898ఎడి, ది రాజా సాబ్, అలాగే సలార్ శౌర్యంగ పర్వం, స్పిరిట్ అలాగే దర్శకుడు హను రాఘవాపుడితో సినిమా కూడా ఒకటి కాగా మరిన్ని చిత్రాలు దర్శకుడు లోకేష్ కనగరాజ్ అలాగే దర్శకుడు రాజమౌళితో కూడా ఓ సినిమా ఉంటుంది అని స్ట్రాంగ్ బజ్ ఉంది. ఇక వీటితో పాటుగా సలార్ సిరీస్ కాకుండా మళ్ళీ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా, కల్కి కి కూడా సీక్వెల్ ఉందనీ టాక్.

ఇక ఫైనల్ గా అయితే లేటెస్ట్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ప్రభాస్ లైనప్ లోకి వచ్చాడని ఫ్రెష్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దీనితో సుమారు ప్రభాస్ నుంచి 10 సినిమాలు వరకు సెన్సేషనల్ లైనప్ ని ప్రభాస్ సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇవన్నీ కూడా మంచి ఎగ్జైటింగ్ గా అనిపిస్తున్న ప్రాజెక్ట్ లే మరి చూడాలి వీటితో ఎన్ని కార్యరూపం దాల్చుతాయి అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు