అదొక గొప్ప అనుభవం అంటున్న ప్రభాస్

అదొక గొప్ప అనుభవం అంటున్న ప్రభాస్

Published on Jul 3, 2019 12:03 AM IST

భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ యొక్క షూటింగ్ ఆస్ట్రియాలో జరుగుతున్నా సంగతి తెలిసిందే. ప్రభాస్, శ్రద్ద కపూర్, ఇతర ముఖ్య తారాగణం మీద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆస్ట్రియాలో అందమైన ఇన్స్బర్క్ నగరం, టైరోల్ రీజియన్ వంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిగింది. ఈ చిత్రీకరణ గురించి ప్రభాస్ మాట్లాడుతూ అక్కడ షూట్ చేయడం గొప్ప అనుభూతి అని, దాన్ని ఎప్పటికీ మర్చిపోలేని అన్నారు. ప్రభాస్ అంతలా చెబుతున్నారంటే మరి అక్కడి సన్నివేశాలు ఎంత అందంగా ఉంటాయో అనే ఆసక్తి కలుగుతోంది.

చిత్రాన్ని ఆగష్టు 15న విడుదలచేయాల్సి ఉండగా ట్రైలర్, పాటలను ప్రేక్షకుల్ ముందుకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడంతో ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు