ప్రభాస్ ‘స్పిరిట్’ ఆ జానర్ మూవీ కాదు – సందీప్ రెడ్డి వంగా

ప్రభాస్ ‘స్పిరిట్’ ఆ జానర్ మూవీ కాదు – సందీప్ రెడ్డి వంగా

Published on Feb 29, 2024 5:07 PM IST


ఇటీవల రణబీర్ కపూర్ తో తీసిన ఆనిమల్ మూవీతో భారీ విజయం సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగా. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఆ మూవీ ప్రస్తుతం ఓటిటి లో కూడా బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.

విషయం ఏమిటంటే, తాజాగా హిందీ మూవీ దుకాణ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా హాజరవడంతో అతడిని ఒక విలేఖరి స్పిరిట్ హర్రర్, లేదా సూపర్ నాచురల్ మూవీనా, అందుకే అటువంటి టైటిల్ పెట్టారా అని అడగగా సందీప్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. స్పిరిట్ మూవీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ తప్ప అది ఏమాత్రం హర్రర్ లేదా సూపర్ నాచురల్ స్టోరీ కాదని క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నానని, దీనిని పట్టాలెక్కించి షూటింగ్ పూర్తి అయిన అనంతరమే ఆనిమల్ పార్క్ షూట్ మొదలెడతాం అని అన్నారు. కాగా స్పిరిట్ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈమూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనపడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు