‘ఆది పురుష్’ కోసం ప్రభాస్ యాక్షన్ !

Published on Feb 27, 2021 6:13 pm IST

నేషనల్ స్టార్ గా ప్రభాస్ బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమాని ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభాస్ కొన్ని రోజుల క్రితం సలార్ కోసం ఒక కీ షెడ్యూల్ పూర్తి చేసాడు. కాగా వచ్చే వారం నుండి ఆదిపురుష్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌ లో ఓ కీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ కసరత్తులు కూడా మొదలుపెట్టాడట.

దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మరి భారీ స్థాయీలో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా రూపొందించబోతున్నారు. అన్నట్టు ఆదిపురుష్ లో ఓ అత్యంత కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రకు హేమా మాలిని అయితేనే న్యాయం జరుగుతుందని.. అందుకే ఆమెను ఆ పాత్ర చేయడానికి ఒప్పించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రభాస్ బాడీ పెంచనున్నాడు. ఎందుకంటే సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం :